నేటి నుంచి పోలీస్ క్యూఆర్ కోడ్
ఖలీల్‌వాడి: ఫిర్యాదుదారులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వారి స్పందనపై ఫీడ్ బ్యాక్‌ను సేకరించేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ గురువారం నుంచి అందుబాటులోకి వస్తుందని ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యూఆర్ కోడ్‌ను రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌లు, రద్దీ ప్రాంతాల్లో క్యూ ఆర్ కోడ్‌కు సంబంధించిన పోస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఫీడ్ బ్యాక్ అందజేయాలని కోరారు.
నేడు మైనారిటీ కమిషన్ చైర్మన్ రాక
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ నేడు (గురువారం) జిల్లా కేంద్రానికి రానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు జిల్లా అధికారులతో చైర్మన్ సమావేశం అవుతారని, మధ్యాహ్నం 2 గంటల వరకు మైనారిటీ వర్గాల వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.
రేపటి నుంచి
వృద్ధాశ్రమం సేవలు
నిజామాబాద్‌అర్బన్: డిచ్‌పల్లి మండలం రాంపూర్‌లో ప్రభుత్వం నిర్మించిన వృద్ధాశ్రమం ఈనెల 10వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వసతి కల్పించేందుకు నిర్మించిన వృద్ధాశ్రమాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వయో వద్ధుల పోషణ, చట్టం జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నిరాశ్రయులైన వయో వృద్ధులకు రాంపూర్‌లోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఇతర వివరాలకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ (98499 33300) లేదా వృద్ధాశ్రమ కో ఆర్డినేటర్(96188 44461), జిల్లా సంక్షేమ అధికారి, మహిళాశిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
సీఐ,ఎస్సై, కానిస్టేబుల్‌కు లోకాయుక్త నోటీసులు?
ఖలీల్‌వాడి: తనపై అక్రమంగా కేసు పెట్టారని ఓ యువకుడు ఫిర్యాదు చేయడంతో కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీఐతోపాటు ఎస్సై, కానిస్టేబుల్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఓ వ్యవహారంలో గతంలో సీఐపై అప్పటి సీపీ కల్మేశ్వర్‌కు తాను ఫిర్యాదు చేయగా, కక్షగట్టిన తనపై కానిస్టేబుల్ కుటుంబ సభ్యులతో ఫిర్యాదు చేయించి ఎస్సై అక్రమంగా కేసు నమోదు చేశారని యువకుడు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుతోపాటు సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌కు ఈనెల 3వ తేదీన నోటీసులు పంపినట్లు సమాచారం. ఈనెల 22వ తేదీన లోకాయుక్తకు రావాలని ఫిర్యాదుదారుడికి ఫోన్ వచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment