చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి బాధ్యతల స్వీకరణ
సుభాష్‌నగర్: జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి శుక్రవారం ఢిల్లీలోని కా ర్యాలయంలో ఎంపీ అర్వింద్ ధర్మపురి సమ క్షంలో బాధ్యతలు స్వీకరించారు. దేశంలో పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తానని గంగారెడ్డి పేర్కొన్నారు. అనంతరం పల్లె గంగారెడ్డిని ఎంపీ సహా కార్యాలయ అధికారులు, సిబ్బంది అభినందించారు.
15,937 మందికి
అందిన రైతు భరోసా
డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు జిల్లాలో 15,937 మంది రైతు లకు రైతు భరోసా నిధులను అందించింది. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.18,52,43,385 జమ అయినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 26న మండలానికి ఒక గ్రామ పంచాయతీని ఎంపిక చేసి రైతులకు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏడాదిలో ఎకరానికి రూ.12వేలు ఇవ్వనుండగా, మొదటి విడతలో ఎకరానికి రూ.6వేల చొప్పున నిధులు రైతుల ఖాతాల్లో పడ్డాయి.
పాఠశాలల ఆకస్మిక తనిఖీ
నవీపేట: నవీపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలతోపాటు మండలంలోని నాగేపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను విద్యా శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్‌జేడీ) సత్యనారాయణరెడ్డి శుక్రవారం ఆకస్మింగా తనిఖీ చేశారు. పదో తరగతి పరీక్షాఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో అశోక్, ఎంఆర్‌సీ రాకేశ్ తదితరులున్నారు.
పోలీస్ క్రీడల్లో
సిల్వర్ మెడల్
ఖలీల్‌వాడి: కరీంనగర్‌లో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రేఖారాణి సిల్వర్ మెడల్ సాధించింది. శుక్రవారం నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ 73 కిలోల విభాగంలో తలపడిన ఆమె 160 కిలోల బరువుఎత్తి తృతీయ స్థానంలో నిలిచింది. రేఖారాణి నగరంలోని నాలుగోటౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించగా, ఆమెను షీ టీమ్‌కు అటాచ్ చేశారు.
మున్సిపల్ అసిస్టెంట్
కమిషనర్‌గా జయకుమార్
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అసి స్టెంట్ కమిషనర్‌గా జయకుమార్ నియమితులయ్యారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌ను కలిసి బాధ్యతలు స్వీకరించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా సుదీర్ఘకాలం జయకుమార్ నిజామాబాద్ మున్సిపాలిటీలో పనిచేశారు. పదోన్నతిపై బోధన్ కార్పొరేషన్‌కు వెళ్లారు. తిరిగి నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్‌కు బదిలీపై వచ్చారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంహెచ్‌వో బాధ్యతలు ఆయనకు అప్పగించనున్నారు. టీపీవో స త్యనారాయణ, బిల్ కలెక్టర్ ఆనంద్‌లు పద వీ విరమణ పొందారు. వీరికి మున్సిపల్ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. అడిషనల్ కమిషనర్ ఎన్ శంకర్ బదిలీపై జీహెచ్‌ఎంసీకి వెళ్లారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరూ చార్జ్ తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment