స్వీయనియంత్రణతో రోడ్డు ప్రమాదాల నివారణ
నిజామాబాద్ అర్బన్: నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని సమీకృత జిల్లా కా ర్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ శాఖ సౌజన్యంతో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ ని బంధనలు, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అతివేగంగా, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమన్నా రు. కుటుంబ సభ్యులందరూ విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా ప్రతి ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు.
జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రోడ్డు ప్రమాదాలకు దారి తీసే పరిస్థితులు, ట్రాఫిక్ నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సదస్సులో ఎంవీఐ కిరణ్ కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం
వల్లే దుర్ఘటనలు జరుగుతున్నాయ్
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులకు అవగాహన సదస్సు
Comments
Please login to add a commentAdd a comment