అంగన్‌వాడీల్లో నాసిరకం గుడ్లు
ఆర్మూర్‌టౌన్: చిన్నారులు, బాలింతలు, గర్భిణుల్లో పోషక లోపాలు అధిగమించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం అందజేస్తోంది. కాని వీరికి అందించే గుడ్లు నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో గర్భిణులు, బాలింతలు వాటిని తినలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌష్టికాహార లక్ష్యం నీరుగారుతోంది. ఆర్మూర్ పట్టణంలోని ఐసీడీఎస్ పరిధిలో 51 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో ఏడు నెలలలోపు ఉన్న చిన్నారులు 625 మంది, ఏడు నుంచి ఏడాది వరకు 658 మంది, ఏడాది నుంచి మూడేళ్ల వరకు 2391 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు 1983 మంది, గర్భిణులు 546 మంది, బాలింతలు 629 మంది ఉన్నారు. వీరికి అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందించాల్సి ఉంది. అయితే నాసిరకం గుడ్లు, ఆహారం అందుతోంది. దీంతో లక్ష్యం నీరు గారిపోతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అంగన్‌వాడీ కేంద్రాలు ఇష్టానుసారంగా నడుస్తున్నాయి. ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన కేంద్రాలు పదిన్నర అవుతు న్నా తెరవడం లేదు. ఆర్మూర్ పట్టణంలోని మూడు సెక్టార్లలో సూపర్‌వైజర్ల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో చిన్నారులు పురప్రాథమిక విద్యకు దూరమవుతున్నారు. టీచర్లు, అంగన్‌వాడీ ఆయాలు ఇంటింటికి తిరిగి చిన్నారులను తీసుకురావాల్సి ఉన్నా ఆచరణలో అమలు కావడం లేదు. ఇటీవల పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అయ్యాయి. వీటిని పర్యవేక్షించాల్సిన సూపర్‌వైజర్లు పట్టించుకోవడం లేదు.
దీంతో వాటిని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు తినలేకపోతున్నారు. పట్టణంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రం వారు ఇచ్చిన గుడ్డును ఓ మహిళ ఇంటికి తీసుకెళ్లి తినేందుకు చూడగా అది నాసిరకంగా వచ్చింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇబ్బందుల్లో బాలింతలు, గర్భిణులు
కేంద్రాలపై సూపర్‌వైజర్ల
పర్యవేక్షణ కరువు
పట్టించుకోని అధికారులు
పర్యవేక్షణ చేస్తున్నాం
పట్టణంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ప్ర తిరోజు పర్యవేక్షణ చేస్తున్నాం. గర్భిణులు, బా లింతలకు నాసిరకంగా గుడ్లు వస్తే మా దృష్టికి తేవాలి. కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం.
– భార్గవి, సీడీపీవో ఆర్మూర్
Comments
Please login to add a commentAdd a comment