పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలి
నిజామాబాద్‌నాగారం: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా ఈనెల 10వ తేదీన 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ అల్బెండజో ల్ మాత్రలు అందించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాలులో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ, శిక్షణను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు మాత్రలు అందించాలన్నారు. అల్బెండజోల్ మాత్రలతో నులి పురుగులను, రక్తహీనతను నిర్మూలించవచ్చని, పోషకాహా ర లోపాన్ని అరికట్టవచ్చన్నారు. అనారోగ్యం, ఇతర కారణాలతో 10వ తేదీన మాత్రలు వేసుకోని పిల్ల లు 17వ తేదీన తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు రమేశ్, రాజు, అంజన్న, పీవో డాక్టర్ వినీత్, ఆర్‌బీఎస్‌కే మేనేజర్ సచిన్, జిల్లా ఆరోగ్యవిద్య శిక్షకులు వెంకటేశ్వర్లు, కో ఆర్డి నేటర్ వెంకటేశం, దీపిక తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment