కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ఖరారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంగనర్–మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్‌కు చెందిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డిని ఖరారు చేసింది. శుక్రవారం పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. నరేందర్‌రెడ్డి గత రెండున్నర నెలల నుంచే నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తూనే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ టికెట్ కోసం పలువురు పోటీ పడినప్పటికీ నరేందర్‌రెడ్డి దక్కించుకోవడం గమనార్హం. నరేందర్‌రెడ్డి పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసినట్లు ‘సాక్షి’లో శుక్రవారం వార్త ప్రచురితమైంది. కాగా బీజేపీ ఇప్పటికే తన అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన సీ అంజిరెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ జరుగనున్నట్లు వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అధికారికంగా ప్రకటించిన
పార్టీ నాయకత్వం
ముందే చెప్పిన ‘సాక్షి’
Comments
Please login to add a commentAdd a comment