సుముహూర్తాల సందడి
నిజామాబాద్ రూరల్: మాఘమాసం సుముహూర్తాలను మోసుకొచ్చింది. జనవరి 31 మొదలుకుని మే చివరి వారం వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఎటు చూసి నా శుభకార్యాల సందడి కనిపించనుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. ఇప్పటికే కళ్యాణ మండపాలు, ఫొటో, వీడియో షూటింగ్, క్యాటరింగ్, బ్యాండ్ బుకింగ్ పూర్తయ్యింది. పురోహితులకు డిమాండ్ పెరగనుంది. వస్త్ర, నగల దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడడం ప్రారంభమైంది. మరోవైపు బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.84వేలకు పైగా పలుకుతోంది. వివాహాల సీజన్‌లో 24 క్యారెట్‌ల పది గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటొచ్చని నగలవ్యాపారులు అంటున్నారు.
సుముహూర్తాలు..
ఫిబ్రవరి : 2, 7, 13, 14, 16, 20, 22, 23,
మార్చి : 2, 7, 13, 14, 15, 16,
ఏప్రిల్: 9, 10, 11, 12, 13, 16, 18, 20, 23, 29, 30,
మే: 1, 7, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23, 28
మాఘ మాసం.. మంచి రోజులు
మోగనున్న పెళ్లి బాజాలు
పెరిగిన బంగారం ధరలు
Comments
Please login to add a commentAdd a comment