ఖలీల్‌వాడి/ఇందల్వాయి (నిజామాబాద్ రూరల్): అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 2013 సెప్టెంబర్ 14న ఇందల్వాయి మండలం నల్లవెల్లి శివారులోని రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగిన ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగయ్య హత్య కేసులో నల్లవెల్లి గ్రామానికి చెందిన ఒడ్డె భాస్కర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేస్తూ, 13 మందికి యావజ్జీవ ఖైదుని రద్దు చేస్తూ హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. కేసు పూర్వపరాల్లోకి వెళితే నల్లవెల్లికి చెందిన భూమి లేని కొందరు పేదలు 309 సర్వే నంబరులోని అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకునేందుకు సిబ్బందితో కలిసి వెళ్లిన నాటి ఎఫ్‌ఆర్‌వో గంగయ్యను సదరు రైతులు వెంబడించి కల్లల్లో కారం కొట్టి దారుణంగా నరికి చంపారు. ఈ కేసులో మొత్తం 37 మంది ముద్దాయిలలో 2017 సెప్టెంబర్ 25న నాటి జిల్లా కోర్టు 14 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. వీరందరూ శిక్షను అనుభవిస్తూ హై కోర్టులో అప్పీలు చేసుకోగా 23 మంది నిర్దోషులుగా, 13 మంది యావజ్జీవ ఖైదును రద్దు చేస్తూ, ఒడ్డె భాస్కర్‌ని ప్రధాన నిందితుడిగా పరిగణిస్తూ జీవిత ఖైదు విధిస్తూ హై కోర్టు తీర్పుని ఇచ్చింది.
హై కోర్టు తీర్పు పట్ల శిక్షను అనుభవిస్తున్న కుటుంబాలు హర్షం వ్యక్తం చేయగా, అటవీ శాఖలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజామాబాద్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టులో జరిగిన నేర న్యాయ విచారణననే ప్రామాణికంగా హైకోర్టు పరిగణిస్తూ తీర్పు వెలువరించడం జిల్లా న్యాయవ్యవస్థకు వన్నె తెచ్చిందని, పలువురు సీనియర్ న్యాయవాదులు పేర్కొన్నారు.
13 మందికి జీవితఖైదు నుంచి విముక్తి
23 మంది నిర్దోషులుగా విడుదల
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు
Comments
Please login to add a commentAdd a comment