పురాతన ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు
నవీపేట: మండలంలోని జన్నెపల్లి గ్రామంలోని అతిపురాతన శివాలయ పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా తోగుల(రంగంపేట) పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు గురువారం సందర్శించారు. గ్రామస్తులతో ఈనెల 15న చర్చించి పునర్నిర్మాణ చర్యలకు శ్రీకారం చుడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు తెడ్డు పోశెట్టి, సంజీవ్‌రావు, వీరేందర్‌రావు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
నవీపేట: కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఆర్‌ఆర్ గార్డెన్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీల్లో చురుకై న కార్యకర్తలకు స్థానం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment