![వ్యాధ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06nzr130-250046_mr-1738871624-0.jpg.webp?itok=n0pZI0VS)
వ్యాధులపై అవగాహన
సిరికొండ: మండలంలోని రావుట్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో నులి పురుగుల నివారణ, కుష్టు వ్యాధిపై విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. కుష్టు వ్యాధి నివారణపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈనెల 10న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్బెండోల్ మాత్రలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సీహెచ్‌వో సుచిత్ర, సూపర్‌వైజర్ మండోదరి, హెచ్‌ఎం శ్రీనివాస్, ఏఎన్‌ఎం జ్యోతి, ఆశ కార్యకర్తలు రుక్మిణి, జమున పాల్గొన్నారు.
కొండూర్‌లో ఉచిత వైద్యశిబిరం
నిజామాబాద్ రూరల్: మండలంలోని కొండూర్‌లో వాయుపుత్ర యువజన సంఘం, ఎన్‌వైకే సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. నగరంలోని సన్‌రైజ్ ఆస్పత్రి వారు 150 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్, యూత్ సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి
సిరికొండ: వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటు మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు నల్లబ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. 61 ఏళ్లు దాటిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. వివిధ గ్రామాలకు చెందిన వీఆర్‌ఏలు పాల్గొన్నారు.
బాధితులకు సరుకుల పంపిణీ
డిచ్‌పల్లి: మండలంలోని దేవనగర్, దేవపల్లి గ్రామాల్లోని కుష్టు వ్యాధి బాధితులకు రిలైబుల్ ట్రస్టు అధ్యక్షుడు రవి ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా వైద్యాధికారి రాజ్యశ్రీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, వ్యాధి కట్టడికి సరైన మందులు వేసుకోవాలన్నారు. లెప్రసీ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమేశ్, జేడీ జాన్‌బాబు పాల్గొన్నారు.
![వ్యాధులపై అవగాహన 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06nzr211-250078_mr-1738871624-1.jpg)
వ్యాధులపై అవగాహన
![వ్యాధులపై అవగాహన 2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06nzr129-250046_mr-1738871624-2.jpg)
వ్యాధులపై అవగాహన
![వ్యాధులపై అవగాహన 3](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06nzr103-250043_mr-1738871624-3.jpg)
వ్యాధులపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment