![‘మాలలను కాంగ్రెస్ నట్టేట ముంచింది’](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06nzt107-250040_mr-1738871624-0.jpg.webp?itok=an8bw2Kt)
‘మాలలను కాంగ్రెస్ నట్టేట ముంచింది’
నిజామాబాద్ నాగారం: మాలలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని జిల్లా మాల సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో గురువారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లన్న, ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ మాట్లాడుతూ.. గతంలో ఆరు శాతం మాలలకు రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు దానిని ఐదు శాతానికి తగ్గించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మాలల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి తీరును నిరసిస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తామన్నారు. మాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వర్గీకరణకు వ్యతిరేకంగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటకు వచ్చి నిరసన తెలపాలని కోరారు. కార్యక్రమంలో ఎడ్ల నాగరాజు, అలుక కిషన్, సిదేవిదాస్, స్వామిదాస్, ఉదయ్‌కుమార్, వినయ్‌కుమా ర్, నీలగిరిరాజు, గోపుప్రభాకర్, నర్సింగ్, అర్గుల సురేశ్, నారాయణ, గంగాధర్, రాంచందర్, దయానంద్, సాయన్న, సాయిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment