రోగులకు అందుబాటులో ఉండాలి
డీఎంహెచ్‌వో రాజశ్రీ
ధర్పల్లి: ఆస్పత్రిలో రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆదేశించారు. గురువారం ధర్పల్లి మండల కేంద్రంలోని సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వార్డును పరిశీలించారు. ఆస్పత్రిలో జరుగుతున్న ప్రసవాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి పలు సూచనలను చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వైద్యులు మౌనిక, నర్సింగ్ ఆఫీసర్ సృజన, సిబ్బంది కృష్ణ, మురళి, సంతోష్, సురేశ్, లతా, నవీన్ ఉన్నారు.
సిరికొండలో..
సిరికొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమి క ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో రాజశ్రీ గురువా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అమ్మ ఒడి రికార్డులను తనిఖీ చేశారు. డెలివరీల సంఖ్య ను పెంచాలని ఆదేశించారు. రోగులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి సూచించారు. మెడికల్ ఆఫీసర్ అరవింద్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment