![పాల న](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06nzr202-250078_mr-1738871623-0.jpg.webp?itok=Iea68t59)
పాల నాణ్యతపై టెస్ట్ చెక్
నిజామాబాద్ రూరల్: పాల నాణ్యతపై విజయ డెయిరీ లాబోరేటరీ టెస్ట్ చెక్‌ను నిర్వహించినట్లు వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి తెలిపారు. గురువారం సారంగాపూర్‌లో గత విజయ డెయిరీ ఫాంలో ఇందూరు వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో వివిధ రకాల ‘పాల నాణ్యతపై టెస్ట్ చెక్’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ప్రతి రోజు 50 వేల లీటర్ల పాలు అమ్మకం జరుగుతుంటే, అందులో 42 వేల లీటర్లు ప్రైవేటు డెయిరీలు, ఆరు వేల లీటర్లు విజయ డెయిరీ, మిగతా రెండు వేల లీటర్లు రైతు డెయిరీల ద్వారా పాల అమ్మకం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. ప్రైవేటు పాల డెయిరీలు నాణ్యతా ప్రమాణాలను ప్యాకెట్‌పై ముద్రించిన సమాచారం ప్రకారం లేకపోవడాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. విజయ డెయిరీ అధికారులు తెలిపిన ప్రకారం జిల్లాలో విజయ డెయిరీకి రైతుల నుంచి పాల సేకరణ కేంద్రాలు 120 ఉంటే, ప్రైవేట్ డెయిరీలకు నిజామాబాద్‌లో ఒక్క పాల సేకరణ కేంద్రం లేక పోవడం గమనార్హమని పేర్కొన్నారు. పాలల్లో అయోడిన్ ఉప్పు నాణ్యతపై అధికారులకు ఫిర్యాదు అందజేశారు. కార్యక్రమంలో పెందోట అనిల్ కుమార్, సందు ప్రవీణ్, వెంకట నర్సింహశర్మ, రాజుల రామనాథం, పౌడపెల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఆహారం కల్తీపై అవగాహన
నిజామాబాద్ రూరల్: రోజురోజుకు పెరుగుతున్న ఆహారం కల్తీపై అవగాహన కలిగి ఉండాలని వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి తెలిపారు. గురువారం మోపాల్ మండలంలోని కులాస్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆహారం కల్తీ, అయోడిన్ ఉప్పు, ప్లాస్టిక్ అంశాలపై వివరించారు. ప్రస్తుతం కల్తీ వినియోగం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అనిల్, రామనాథం, జాకీర్ బేగం, రజిత తదితరులు ఉన్నారు.
![పాల నాణ్యతపై టెస్ట్ చెక్ 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06nzr205-250078_mr-1738871624-1.jpg)
పాల నాణ్యతపై టెస్ట్ చెక్
Comments
Please login to add a commentAdd a comment