పనిచేసే చోట మహిళలకు రక్షణ కల్పించాలి
ఖలీల్‌వాడి: మహిళలు పని చేసేచోట వారి రక్షణకు చర్యలు చేపట్టాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో గురువారం ‘మహిళలకు పనిచేసే చోట జరుగుతున్న లైంగిక వేధింపులు’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. మహిళలను ఎవరైనా లైంగికంగా వేధిస్తే వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లేదా షీటీమ్, భరోసా కేంద్రాలలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. మహిళలు తాము పనిచేసే చోట కమిటీలు ఏర్పాటు చేసుకుని, సమస్యలపై చర్చించుకోవాలన్నారు. లీగల్ సర్వీసె స్ అథారిటీ ద్వారా మహిళలు న్యాయసలహాలు సూచనలు తెలుసుకోవాలన్నారు. సలహాలు, సూచనల కోసం ట్రోల్ ఫ్రీ నెంబర్ 15100ను సంప్రదించాలన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ, అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుష్బూ ఉపాధ్యాయ, డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బీ పాల్గొన్నారు.
జిల్లా జడ్జి సునీత కుంచాల
Comments
Please login to add a commentAdd a comment