![శాసీ్త్రయంగానే కులగణన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10nzt113f-250040_mr-1739216505-0.jpg.webp?itok=4nu3aIGG)
శాసీ్త్రయంగానే కులగణన
● ప్రతిపక్షాల రాద్ధాంతం సరికాదు
● రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్
కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్
నిజామాబాద్ నాగారం: కులగణన శాసీ్త్రయంగా జరిగిందని, అయినా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. నగరంలోని పద్మశాలి కల్యాణ మండపంలో సోమవారం జాతీయ చేనేత ఐక్యవేదిక జిల్లా కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఈసందర్భంగా అనిల్ నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చే యించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేనేత రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. త్వరలోనే చేనేత తదితర సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎంపీగా అర్వింద్‌ను గెలిపించినా ఆయన పద్మశాలీలకు చేసింది ఏమీ లేదన్నారు. మాజీ ఎంిపీ రాపోలు ఆనంద్ భాస్కర్ మాట్లాడుతూ.. సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక పద్మశాలి స మాజం అని అన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు దీకొండ యాదగిరి, బిజ్జు దత్తా ద్రి, పుల్గం హన్మాండ్లు, గుజ్జ రాజేశ్వరి, గుజ్జేటి వెంకటనర్సయ్య, రాపె ల్లి గురుచరణం, గుడ్ల చంద్రబాగ, బల్ల లక్ష్మీబాయి తదితరులు పా ల్గొన్నారు.
విద్యార్థులు ఇంటికి
వెళ్లే వరకు టీచర్ ఉండాలి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ప్రా థమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాఠశా ల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే వరకు ప్రతి రోజూ ఒక టీచర్ అందుబాటులో ఉండాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల సమయం ముగియగానే టీచర్లంద రూ వెళ్లిపోవడం, విద్యార్థులను తీసుకు వెళ్లేందుకు వారి తల్లిదండ్రులు, సహాయకులు ఆలస్యంగా రావడం కారణంగా కొందరు విద్యార్థులు పాఠశాలల్లోనే ఉండిపోతున్నారు. ఇటీవల ఓ విద్యార్థిని పాఠశాలలో ఉండగా కుక్క లు దాడి చేశాయని, ఇటువంటి ఘటనలు చో టుచేసుకోకుండా పాఠశాలల్లో ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇంటికి వెళ్లే వరకు అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రతిరోజూ పాఠశాల లో ఒక టీచర్ ఉండాలని డీఈవో అశోక్ ఒక ప్రకటనలో ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment