![దైవ క](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10nzt04f-604902_mr-1739216505-0.jpg.webp?itok=V6jshOuU)
దైవ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతిఒక్కరూ దైవకార్యాల్లో భా గస్వాములు కావాలని హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతిస్వామి పిలుపునిచ్చారు. నగరంలోని అ మ్మనగర్‌లో వ్యాపారవేత్త మంచాల జ్ఞానేందర్‌గు ప్తా ఆధ్వర్యంలో నిర్మించనున్న వారాహిమాత ఆల యానికి సోమవారం విద్యారణ్యభారతి స్వామి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన పాటిస్తే సమాజంలో సమస్యలు తేలికగా పరిష్కరించుకోవచ్చన్నారు. వారాహి మాత ఆలయాన్ని ని ర్మించేందుకు ముందుకొచ్చిన జ్ఞానేందర్‌గుప్తాను అభినందించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్, రాష్ట్ర నాయకుడు మాదాసు స్వామియాదవ్, అమ్మనగర్ అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
హంపీ పీఠాధిపతి
విద్యారణ్యభారతి స్వామి
నగరంలో వారాహిమాత
ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
![దైవ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10nzt02-604902_mr-1739216506-1.jpg)
దైవ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
Comments
Please login to add a commentAdd a comment