![గల్లం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10jkl101-250025_mr-1739216506-0.jpg.webp?itok=lL9X547B)
గల్లంతైన మిషన్ భగీరథ ఉద్యోగి మృతదేహం లభ్యం
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రం శివారులోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతైన మిషన్ భగీరథ ఇంట్రాసెక్షన్ హెల్పర్ కర్రె విఠల్ (44) మృతదేహం సోమవారం ఉదయం బూర్గుల్ శివారులోని డిస్ట్రిబ్యూటరీ–3 వద్ద లభ్యమైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన విఠల్ గ్రామ రెవెన్యూ వీఆర్‌ఎగా పని చేసేవాడు. గత ప్రభుత్వం వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీ చేయగా అతడు ఎల్లారెడ్డి మండల మిషన్ భగీరథ కార్యాలయంలో హెల్పర్‌గా చేరాడు. రోజుమాదిరిగానే ఆదివారం మహమ్మద్ నగర్ శివారులోని మంజీరా ప్రధాన కాలువ వద్ద కాలకృత్యాలు తీర్చుకునేందుకు విఠల్ వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. అధికారులు నీటి విడుదలను నిలిపివేయించి కాలువలో అతడి అచూకీ కోసం రాత్రి వరకు గాలించారు. కానీ సోమవారం ఉదయం మృతదేహం లభ్యం అయ్యింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
వరదకాలువలో ఛత్తీస్‌గఢ్ వాసి..
బాల్కొండ: మండలంలోని బస్సాపూర్ గ్రామ శివారులోగల వరద కాలువలో ఆదివారం ప్రమాదవశాత్తు గల్లంతైన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీర్‌సింగ్ మారాబి(40) మృతదేహం సోమవారం మధ్యాహ్నం లభ్యమైంది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలు ఇలా.. బస్సాపూర్‌లో ఓ మేసీ్త్ర వద్ద అతడు తాపీ పని చేసేవాడు. తన సెల్‌ఫోన్ మరమ్మతుల కోసం బీర్‌సింగ్ మారాబి బాల్కొండ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ వరద కాలువలో పడి గల్లంతయ్యాడు. స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టగా ఎక్కడ పడిపోయాడో అక్కడే మృత దేహం లభ్యమైంది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
![గల్లంతైన మిషన్ భగీరథ ఉద్యోగి మృతదేహం లభ్యం1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10blk04-250010_mr-1739216506-1.jpg)
గల్లంతైన మిషన్ భగీరథ ఉద్యోగి మృతదేహం లభ్యం
Comments
Please login to add a commentAdd a comment