![ఇసుక ట్రాక్టర్ల పట్టివేత](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10nzr128-250046_mr-1739216506-0.jpg.webp?itok=Me00uYpZ)
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
సిరికొండ: మండలంలోని కొండూర్ శివారులోగల వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై బాల్‌సింగ్ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సోమవారం రెవెన్యు ఇన్‌స్పెక్టర్ గంగరాజం పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ట్రాక్టర్లు సర్పల్లి తండాకు చెందిన మాలావత్ బాలాజీ, మాలావత్ భాస్కర్‌లకు చెందినవన్నారు.
‘చిలుకూరు’ అర్చకుడిపై దాడి కేసులో
బోధన్ వాసి అరెస్టు
ఖలీల్‌వాడి: చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన కేసులో జిల్లాలోని బోధన్‌కు చెందిన సాయిలు అలియాస్ సాయినాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని రాజేంధర్‌నగర్ పోలీసులు రెండు రోజుల క్రితం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సాయినాథ్ ప్రస్తుతం రామరాజ్యం సంస్థ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. 2022 నుంచి జిల్లాలో రామరాజ్యం సంస్థ కోసం పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
కామారెడ్డి క్రైం: పట్టణ శివారులోని దేవునిపల్లి పరిధిలోగల విద్యుత్ నగర్ కాలనీలో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో దేవునిపల్లి పోలీసులు సోమవారం సాయంత్రం అక్కడికి వెళ్లారు. ముగ్గురు విటులను, ఓ మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment