ఎమ్మెల్సీ అభ్యర్థుల
● నామినేషన్ల పరిశీలన మంగళవారం జరుగనుంది. ఈ నెల 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ప్రభావం చూపే స్వతంత్ర అభ్యర్థులకు డబ్బులిచ్చి ఉపసంహరణ చేయించేందుకు రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నట్లు చర్చ నడుస్తోంది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇతర అభ్యర్థులు నంబర్ గేమ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు తయారు చేసుకుని అమలు చేస్తున్నారు. ఓటర్ల సంఖ్యపై లెక్కలు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా పట్టభద్రుల ఓట్లు 1,60,260 ఉన్నాయి. తరువాత మెదక్ ఉమ్మడి జిల్లాలో 77,781 ఓట్లు, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 69,134 ఓట్లు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 47,984 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు ఆయా జిల్లాల్లో ఉన్న ఓట్ల సంఖ్యకు అనుగుణంగా పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి కరీంనగర్ కావడంతో ఇది తనకు కలిసొస్తుందని ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నరేందర్‌రెడ్డికి టిక్కెట్టు ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నరేందర్‌రెడ్డి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి తనకు అత్యధికంగా ఓట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. తరువాత వరుసగా ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చివరి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి సైతం కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండడంతో పాటు సంఘ్ పరివార్ శ్రేణులు చూసుకుంటాయిలే అన్న ధీమాతో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తక్కువ ఓట్లు ఉండడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ప్రధాన పార్టీల అభ్యర్థులు చిన్నచూపు చూస్తున్నారని పలువురు అంటున్నారు.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఈ రెండు పార్టీల శ్రేణులు సైతం తాము ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా స్వతంత్రులుగా బరిలోకి దిగిన వారిలో వివిధ రంగాల్లో పనిచేసినవారున్నారు. పరిచయాలు ఎక్కువగా ఉండడంతో తమ జిల్లాల్లో గణనీయమైన ఓట్లు సాధించేందుకు కష్టపడుతున్నారు. ఉపసంహరణ రోజునాటికి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో చూడాలని పట్టభద్రులు ఆసక్తిగా ఉన్నారు.
పట్టభద్రులు
ఉపాధ్యాయ ఓటర్లు
రెవెన్యూ మండలాలు పోలింగ్ పురుషులు మహిళలు మొత్తం
డివిజన్ స్టేషన్లు
నిజామాబాద్ 10 21 8816 5525 14341
బోధన్ 10 11 3316 1721 5037
ఆర్మూర్ 13 16 7861 4335 12196
మొత్తం 33 48 19993 11,581 31574
రెవెన్యూ మండలాలు పోలింగ్ పురుషులు మహిళలు మొత్తం
డివిజన్ స్టేషన్లు
నిజామాబాద్ 10 10 1054 947 2001
బోధన్ 10 10 391 310 701
ఆర్మూర్ 13 13 731 318 1049
మొత్తం 33 33 2176 1575 3751
ఎమ్మెల్సీ ఓటర్ల తుదిజాబితా విడుదల
నిజామాబాద్‌అర్బన్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు తుది జాబితాను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సోమవారం విడుదల చేశారు. గత నెల 30న ఓటరు జాబితా ప్రచురించినప్పటికీ మళ్లీ ఓటు నమోదుకు అవకాశం కల్పించి తుది జాబితాను విడుదల చేశారు.
పట్టభద్రుల ఓటర్ల సంఖ్యను బట్టి
ఆయా జిల్లాల్లో ప్రచారానికి ప్రాధాన్యత
కరీంనగర్ జిల్లాపైనే ఎక్కువ ఫోకస్
అనుకూలమైన ఓట్లపై
లెక్కలేసుకుంటున్న ప్రధాన పార్టీలు
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న
స్వతంత్ర అభ్యర్థులు
Comments
Please login to add a commentAdd a comment