ఘనంగా జాతీయ నృత్య కళా పోటీలు | Sakshi
Sakshi News home page

ఘనంగా జాతీయ నృత్య కళా పోటీలు

Published Tue, May 7 2024 10:35 AM

-

గుడివాడటౌన్‌: స్థానిక బంటుమిల్లి రోడ్డులోని అలంకృత ఫంక్షన్‌ హాలులో శివజ్యోతి నృత్యాలయ నృత్య పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం జాతీయస్థాయి నృత్య పోటీలు ఘనంగా ప్రారంభమయ్యా యి. రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 250 మంది పైబడి నృత్య కళాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రముఖ కళాకారిణి రేవతీ ప్రసాద్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారని, ప్రతి ఒక్కరికీ పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement