విజయవాడస్పోర్ట్స్:రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ బాల, బాలికల హాకీ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఎన్టీఆర్ జిల్లా జట్లను ఈ నెల 11వ తేదీన సింగ్‌నగర్ స్టేడియంలో ఎంపిక చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా హాకీ సంఘం కార్యదర్శి కె.రాజశేఖర్ తెలిపారు. 2009 జనవరి ఒకటో తేదీ తరువాత పుట్టిన వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులని స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రంతో ఆ రోజు ఉదయం ఏడు గంటలకు ఎంపిక ప్రాంగణంలో సంప్రదించాలని సూచించారు. ఎంపికై న బాలుర జట్టు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మదనపల్లిలో జరిగే రాష్ట్ర పోటీల్లో, బాలికల జట్టు 27 నుంచి 29వ తేదీ వరకు అనంతపురంలో జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొంటాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment