పండుగైనా, పబ్బమైనా, బంధువులు వచ్చినా, ఏ చిన్న కార్యక్రమం ఇంట్లో జరుగుతున్నా మార్కెట్‌లో లభించే పిండి వంటలు కొనుగోలు చేసేందుకు అలవాటు పడిపోయిన రోజులివి. ప్రజల అవసరాల మేరకు కార్పొరేట్ సంస్థలు సైతం పిండివంటల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి అవుట్ లెట్‌లలో విక్రయించేస్తున్నారు. అయితే సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పెద్ద పండుగ సంక్రాంతి. పండుగ నెల పట్టారంటే గతంలో ఏ ఊళ్లో చూసినా తెల్లవారుజామున రోకళ్ల చప్పుళ్లు.. పిండి వంటల ఘుమఘుమలతో గ్రామాలు కళకళలాడేవి. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. మార్కెట్‌లో లభించే వంటకాలకు డిమాండ్ పెరిగింది. కానీ నేటికీ ఆ ఊరు మహిళలు పండుగ వచ్చిందంటే అంతా ఒక చోట చేరి రోజుకు ఒకరి ఇంటి వద్ద రుచికరమైన, కమ్మని పిండి వంటలను చేసుకుంటూ సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటారు. అదే కంకిపాడు మండలంలోని చలివేంద్రపాలెం గ్రామం.
– కంకిపాడు
Comments
Please login to add a commentAdd a comment