ఊరంతా ఏకమై.. సంప్రదాయం వేడుకై
సంప్రదాయాన్ని కొనసాగిస్తూ..
ఆరోగ్యం కూడా ప్రధానమే..
బయటి మార్కెట్‌లో లభించే పిండివంటలు తయారీ ఎలా ఉంటుందో? అనేది అందరి నోటా వచ్చే ప్రశ్నే. అయితే తప్పనిసరి కావటంతో కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ గ్రామస్తులు మాత్రం పండుగ వేళకు అన్ని ఇళ్లల్లో నోరూరించే, ఘుమఘుమలాడే అరిశెలు, చెక్కలు, బూందీ లడ్డూ, బూందీ, చక్రాలు, ఇంకా రకరకాల పిండి వంటలు సిద్ధమవుతాయి. నచ్చిన వంటకాలు, నచ్చినట్టు చేసుకుంటే ఆ రుచే వేరు కదా అంటారు ఈ ఊరు మహి ళలు. అంతేకాకుండా గ్రామంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పువ్వులుసేకరించి మాల లు కట్టి స్వయంగా దేవతామూర్తులను అలంకరిస్తారు. ఇందులోనూ తమ ఐక్యతను, అంతా ఒకటే అన్న భావనను ప్రస్పుటం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment