మచిలీపట్నంటౌన్: స్థానిక జవ్వారుపేటలోని శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్‌ల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ నెల 12వ తేదీన కలుసుకోబోతున్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రికలను నిర్వాహకులు శుక్రవారం స్కూల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ చిత్తజల్లు రామకృష్ణ, పూర్వ విద్యార్థులు షేక్ మహమ్మద్ సాహెబ్, శ్రీకాంత్ మాట్లాడుతూ 1983 నుంచి 2023 వరకూ స్కూల్లో చదువుకున్న విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో స్థిర పడ్డ వారంతా ఈ నెల 12వ తేదీ ఆదివారం నగరంలో పెడన బైపాస్‌రోడ్‌లో ఉన్న మిర్యాల కన్వెన్షన్ హాల్లో కలుసుకుని పూర్వ అనుభూతులను పంచుకుంటారన్నారు. 40 సంవత్సరాల క్రితం చదువుకున్న దాదాపు రెండు వేల మంది ఇక్కడ కలుసుకోబోతున్నట్లు వివరించారు. ఆహ్వానం అందకపోయినా స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థీ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఏపీడీఎంసీ ఆధ్వర్యంలో వైద్య సేవలు
పెనమలూరు: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కానూరులో ఏపీడీఎంసీ కార్యాలయం వద్ద ఆరోగ్యరథాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించి ప్రసంగించారు. మైనింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. ఇందులో భాగంగానే ఆరోగ్య సేవలు, విద్యాలయాలు ఏర్పాటు చేశామని అన్నారు. రూ. కోటి వ్యయంతో పూర్తి సాంకేతికత కలిగిన వాహనం ప్రజల ముందుకు తీసుకువచ్చామన్నారు. త్వరలో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద ఏపీడీఎంసీ రాష్ట్ర వ్యాప్తంగా సేవలు విసృతం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment