పుస్తకావిష్కరణ సభలో వక్తలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న మాట వాస్తవమేనని, అంతకంటే ముందు మనిషే ప్రమాదంలో ఉన్నాడని పలువురు వక్తలు పేర్కొన్నారు. హనుమాన్‌పేటలోని ఆలపాటి ఫంక్షన్ హాల్‌లో కాట్రగడ్డ వెంకటేశ్వరరావు స్మారక రాజ్యాంగ పరిరక్షణ వేదికపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రాసిన ‘దేశం ఎటుపోతోంది’ పుస్తకావిష్కరణ శనివారం జరిగింది. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత ఎన్టీ రామారావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘రాజ్యాంగానికి ప్రమాదం – పరిరక్షించుకోవాలి ప్రజలందరు’పై చర్చాగోష్టి జరిగింది. ఏఐఎల్‌యూ జాతీయ ఉపాధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్, డి.వి.వి.ఎస్.శర్మ మాట్లాడుతూ.. జర్నలిస్టులు, హేతువాదులపై దాడులు, అక్రమ అరెస్టులు బాధాకరమన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పుస్తక రచన ఆవశ్యకతను వివరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. ఉమాహేశ్వరరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు అన్నిరకాల అన్యాయం చేసిన అమిత్ షా ఏ ముఖం పెట్టుకుని రాష్ట్ర పర్యటనకు వస్తున్నా రని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సీహెచ్. బాబురావు, రైతు ఉద్యమ నాయకులు చుండూరు రంగారావు, కె.వి.వి.ప్రసాద్, మనోరమ, అడబాల లక్ష్మి, కాట్రగడ్డ రజనీకాంత్, డి.హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment