సౌకర్యాలు కల్పించాలి..
రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలను నిర్లక్ష్యం చేయడం సరికాదు. రోగులకు అవసరమైన మందులను సరఫరా చేయడంతో పాటు, కొరత ఉన్న సిబ్బందిని నియమించాలి. కేంద్రం ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలంటుంటే, రాష్ట్రంలోనేమో ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం
ఉన్నతాధికారులతో
చర్చించాం
ఆయుర్వేద ఆస్పత్రి, కళాశాలలో సిబ్బంది కొరత ఉంది. ఈ విషయమై ఆయుష్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించాం. ఇటీవల కొందరు వైద్యులను నియమించారు. ఉన్నవారికి ఉద్యోగోన్నతులు ఇచ్చారు. ఈ ఏడాది యూజీ సీట్లు అడ్మిషన్లకు అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ సాయిసుధాకర్, ప్రిన్సిపాల్,
ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, విజయవాడ
●
Comments
Please login to add a commentAdd a comment