![‘సివిల్స్’తో అత్యున్నత స్థాయిలో నిలవాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06viw103-310141_mr-1738869282-0.jpg.webp?itok=h9iqsiUc)
‘సివిల్స్’తో అత్యున్నత స్థాయిలో నిలవాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): బీసీ అభ్యరర్థులు సివిల్ సర్వీసెస్‌లో ఉత్తీర్ణులై అత్యున్నత స్థాయిలో నిలిచి మంచి కొలువులు పొందాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆకాంక్షించారు. విజయవాడ గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్‌లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఆమె గురువారం సందర్శించారు. సెంటర్‌లోని వంట గది, విశ్రాంత గదులను పరిశీలించారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. మౌలిక వసతులు, భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థుల హాజరు, ఆధ్యాపకుల బోధనపై ఆరా తీశారు. మంత్రి సవిత మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్ సర్వీసెస్‌కు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సహకారాన్ని వినియోగించుకుని సివిల్స్‌లో ఉత్తీర్ణులు కావాలన్నారు. ఇప్పటికే తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనకు ఫోన్ చేసి తెలియజేయాలని చెబుతూ అభ్యర్థులకు ఫోన్ నంబర్ ఇచ్చారు. గతంలో బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన ఎంతో మంది విజయం సాధించారన్నారు. అదే స్ఫూర్తితో ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీరాము సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
Comments
Please login to add a commentAdd a comment