‘కృష్ణా’ హ్యాండ్‌బాల్ విజేత కేబీఎన్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల మహిళ హ్యాండ్ బాల్ పోటీల్లో కేబిఎన్ కళాశాల విజేతగా నిలిచిందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి తెలిపారు. .నాకౌట్ పద్ధతిలో జరిగిన పోటీల్లో తమ కళాశాల ఆంధ్ర లయోల, సిద్ధార్థ మహిళా, డాక్టర్ ఎల్.హెచ్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్లపై అత్యుత్తమ ప్రతిభ కనబరచి, అధిక పాయింట్లు సాధించి, చాంపియన్ షిప్ కై వసం చేసుకుందన్నారు. తమిళనాడులో జరగబోయే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనేందుకు కృష్ణా యూనివర్సిటీ మహిళా హ్యాండ్‌బాల్ జట్టును ఎంపిక చేశారని తెలిపారు. ఎస్‌కేపీవీవీ హిందూహైస్కూల్స్ కమిటీ ఏవో డాక్టర్ వి.నారాయణరావు, కళాశాల వ్యాయామ విభాగాధిపతి డిహేమచంద్రరావును అభినందించి, సత్కరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment