![ప్రముఖ వైద్యురాలు మారు కన్నుమూత](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06vie11b-310149_mr-1738869283-0.jpg.webp?itok=BoQf8NuG)
ప్రముఖ వైద్యురాలు మారు కన్నుమూత
పటమట(విజయవాడతూర్పు): ప్రముఖ వైద్యురాలు, సంఘ సేవకురాలు, నాస్తికోద్యమ నాయకుడు గోరా నాలుగో కుమార్తె డాక్టర్ మారు (80) గురువారం మధ్యాహ్నం కన్ను మూశారు. ఆమె ప్రముఖ వైద్యుడు డాక్టర్ సమరం సోదరి. ఇద్దరూ విజయవాడలో గత 55 సంవత్సరాలుగా వాసవ్య నర్సింగ్ హోం ద్వారా సేవలందిస్తున్నారు. ఆమె అనేక గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లోనూ సేవలందించడమే కాకుండా మూఽఢ నమ్మకాల నిర్మూలనకు ఎంతో కృషి చేశారు. కొన్ని వేల మంది పోలియో చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడంలోనూ, వేల శుక్లాల ఆపరేషన్లు చేయించడంలోనూ, వందలాది మందికి నర్సింగ్ ట్రైనింగ్ ఉచితంగా అందించడంలోనూ ఆమె ప్రముఖ పాత్ర వహించారు. నాస్తికోద్యమ కార్యక్రమాల్లో క్రియా శీలకంగా పాల్గొన్నారు. విజయవాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. ఆమె మృతి విషయం తెలియగానే వందలాదిమంది అభిమానులు, వైద్యసేవలు పొందినవారు, వైద్యులు తరలివచ్చి నివాళులర్పించారు. కుటుంబసభ్యులు ఆమె నేత్రాలను స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకుకు దానం చేశారు. ఆమె అంతిమ యాత్ర శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు విజయవాడ నాస్తిక కేంద్రంలో ప్రారంభం అవుతుందని నాస్తిక కేంద్రం ఒక ప్రకటనలో తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment