కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన కళాకారులు
పర్లాకిమిడి: రాష్ట్ర ప్రభుత్వం గజపతి జిల్లాలో ముఖ్యమంత్రి జనజాతి (ఎస్టీ) జీవికా మిషన్ పథకం అమలు చేసింది. స్థానిక బిజూ కల్యాణ మండపంలో కలెక్టర్ స్మృతి రంజన్ ప్రధాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి పథకాన్ని మంగళవారం ప్రారంభించారు అంతుకుముందు జిల్లాలోని ఐదు వెనుకబడిన సమితిల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున సాంప్రదాయ నృత్యాలతో బిజూ కల్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఐటీడీఏ పరిధిలో 143 క్లస్టర్స్ ద్వారా ఎంపికై న గిరిజన యువతీ యువకులు వివిధ కుటీర పరిశ్రమలు, పండ్ల తోటలు, తేనె అమ్మకాలు చేస్తున్న యువ పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. పథకాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ బీరేంద్ర కుమార్ దాస్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ అధికారి ఫాల్గుణీ మఝి, స్పెషల్ డవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ మరియం రైయితో, సీసీడీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అడ్డాల జగన్నాథ రాజు తదితరలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment