యంత్రాలతో మనరేగా పనులు | - | Sakshi
Sakshi News home page

యంత్రాలతో మనరేగా పనులు

Published Tue, Feb 11 2025 1:13 AM | Last Updated on Tue, Feb 11 2025 1:12 AM

యంత్రాలతో మనరేగా పనులు

యంత్రాలతో మనరేగా పనులు

మల్కన్‌గిరి: జిల్లా కలిమెల సమితి ఎం.పి.వి 82 గ్రామం వద్ద రహదారి నిర్మాణ పనులు మనరేగా పథకంలో నిర్వహిస్తున్నారు. ఈ పనుల్లో రోజు కూలీలుగా గ్రామాస్తులను వాడకూండా అధికారులతో చేతులు కలిపి కాంట్రాక్టర్లు యంత్రాల ద్వారా పనులు చేస్తున్నారు. పేదలు వలస వెళ్ల కూడనే ఉద్దేశంతో ప్రభుత్వం మనరేగా పథకంలో ఏడాదికి 100 రోజులు ఉపాధి కాల్పిస్తుంది. ఈ రహదారి నిర్మాణ పనులు కోసం రూ.7.71 లక్షల వ్యయంతో పూర్తి చేయాలి. ఈ పనుల్లో కూలీలను వాడాలి. అలా చేయడం లేదు. ఈ విషయంపై జిల్లా అధికారులు దృష్టిపెట్టి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై జూనియార్‌ ఇంజినీర్‌ను సంప్రదించేదుకు ప్రయత్నించినప్పటికీ ఆయన నుంచి ఏలాంటి స్పందన రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement