పిల్లల చదువుపై దృష్టిపెట్టాలి
జయపురం: పిల్లల చదువుపై పెద్దలు దృష్టిసారించాలని సునైన కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ ఎన్.దాశరథి అన్నారు. చిన్నారులకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రీడల ద్వారా అభినవ విద్యావిధానం ప్రశంసనీయమని.. ఈ నూతన పద్ధతి సత్ఫలితాలు ఇస్తోందని చెప్పారు.ఆ దివారం సాయంత్రం స్థానిక ఫవర్ హౌస్ గీతాంజలి మండప ప్రాంగణంలో బణిత ప్లే స్కూల్ నాలుగో వార్షికోత్సవంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను మంచి వ్యక్తులుగా తీర్చి దిద్దాలన్నారు. అభినవ విద్యా శైలిపై ఆయన సుదీర్గంగా ప్రసంగించారు. బణితా స్కూల్ డైరెక్టర్ శిభాశిష్ పాణిగ్రహి అత్యక్షతన జరిగిన వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా జయపురం మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, గౌరవ అతిథిగా విశ్రాంత ఉపాధ్యాయులు, జూనియర్ రెడ్‌క్రాస్ జిల్లా అధికారి యజ్ఞేశ్వర పండ, ప్రత్యేక అతిథులుగా కొరాపుట్ జిల్లా డైట్, జయపురం అధికారి రూపచంద్ర సొరెన్, జయపురం బ్లాక్ విద్యాధికారి కై ళాశ చంద్రశతపతి, జయపురం రెడ్‌ఉడ్ ఇంగ్లిష్ పాఠశాల ప్రిన్సిపాల్ అనిత దాస్, జయపురం మీరా డాన్స్ గ్రూపు డైరెక్టర్ పంచానన మిశ్ర ప్రసంగించారు. సభానంతరం పిల్లలు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో సభికులను అలరించారు. కొంతమంది చిన్నారులు శ్లోకాలను పఠించి శ్రోతలను అబ్బుర పరచారు. మరి కొందరు నృత్య నాట్యాలతో ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment