![గుణుప](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ors71a-280027_mr-1739216202-0.jpg.webp?itok=AfKXgXBp)
గుణుపూర్–తెరువలి రైలు మార్గంపై లోక్‌సభలో ప్రస్తావన
రాయగడ: కొరాపుట్ లోక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక సొమవారం లోక్‌సభ జీరో అవర్‌లో రాయగడ జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న గుణుపూర్–తెరువలి రైలు మార్గం గురించి ప్రస్తావించారు. ప్రతిపాదిత ఈ మార్గంలో రైల్వే విభాగం కొన్ని మార్పులు చేయగలిగితే మరికొన్ని సమితుల ప్రజలు రైలు సౌకర్యాలను పొందగలరని వివరించారు. కొండలు, లోయ లు తొలచి గుణుపూర్ –తెరువలి రైలు మార్గం పనులు చేపడుతున్న నేపథ్యంలో అదే గుణుపూర్ వయా బిసంకటక్, పద్మపూర్, రామనగుడ, గుడారి మీదుగా మార్గాన్ని నిర్మించగలిగితే లోయలు, కొండలు వంటి అవాంతరాలు ఎదురు కావాలని వివరించారు. ప్రతిపాదించిన గుణుపూర్ వయా బిసంకటక్, పద్మపూర్, రామనగుడ, గుడారి మీదుగా నిర్మాణం కొనసాగితే ఈ మార్గంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అదేవిధంగా ప్రజల ఆర్థిక స్థితి గతులు కూడా మెరుగుపడతాయని వివరించారు. దీనిపై కేంద్ర రైల్వే శాఖ దృష్టి సారించాలని కోరారు.
అగ్ని సురక్షపై అవగాహన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి అటవీ శాఖ అభికారి వాసుదేవ్ నాయిక్ ఆదేశాల మేరకు.. సోమవారం దళపతిగూఢ పంచాయతీ డాయిగూఢ గ్రామంలో రేంజర్ మురళీధర్ మహరణ నేతృత్వంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవి సమీపిస్తున్నందున ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఇప్ప పూల కోసం పోడు వ్యవసాయం చేస్తారు. ఈ నేపథ్యంలో అడవులకు నిప్పు పెట్టడం వల్ల నష్టం జరుగుతుందని వివరించారు. గిరిజనుల్లో చైతన్యం కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఫ్లడ్ లైట్లు ఎందుకు వెలగలేదు..?
● వివరణ కోరుతూ ఓసీఏకి తాఖీదులు జారీ చేసిన సర్కారు
భువనేశ్వర్: కటక్ బారాబటి స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్ సమయంలో ఫ్లడ్ లైట్ల వైఫల్యం కారణంగా 25 నిమిషాల పాటు ఆట నిలిపివేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ పరిస్థితుల పట్ల వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్ నిర్వాహక సంస్థ ఒడిశా క్రికెటు అసోసియేషన్ ఓసీఏకి సోమవారం తాఖీదులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్రీడలు, యువజన సేవల విభాగం నిర్వాహక సంస్థకు 10 రోజుల గడువు కేటాయించింది. ఉత్కంఠభరిత మ్యాచ్ సమయంలో ఫ్లడ్ లైట్ల అంతరాయానికి గల కారణాన్ని వివరించి, అలాంటి లోపాలకు కారణమైన వ్యక్తులు, ఏజెన్సీలను గుర్తించి, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించాలని తాఖీదుల్లో ఆదేశించింది.
ఆగని తాబేలు మాంసం విక్రయాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితిలో సోమవారం ఓ వ్యక్తి బహిరంగ మార్కెట్‌లో తాబేలు మాంసం విక్రయించారు. తాబేలు మాంసం విక్రయించడం నిషేధం. కానీ కోరుకొండ సమితి పిటాగేటా పంచాయతీలో వారపు సంతలో కిలో రూ.350కు అమ్ముతున్నాడు. దీనిపై అటవీ శాఖాధికారులను సంప్రదించగా ఆరా తీసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
![గుణుపూర్–తెరువలి రైలు మార్గంపై లోక్‌సభలో ప్రస్తావన 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10ors72a-280027_mr-1739216203-1.jpg)
గుణుపూర్–తెరువలి రైలు మార్గంపై లోక్‌సభలో ప్రస్తావన
Comments
Please login to add a commentAdd a comment