![గ్రీవ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ors81b-280031_mr-1739216205-0.jpg.webp?itok=yHmT2och)
గ్రీవెన్స్‌కు 86 వినతులు
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి సమితి పురుణాపాణి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామముఖి అధికారులు గ్రీవెన్సుసెల్‌ను నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా, డీఆర్‌డీఏ ముఖ్య కార్యనిర్వాహాణాధికారి గుణనిధి నాయక్ హాజరయ్యారు. గ్రీవెన్సుసెల్‌కు 86 వినతులు వచ్చాయి. వీటిలో గ్రామసమస్యలకు సంబంధించి 53, వ్యక్తిగతం 15 ఉన్నాయి. మూడు వినతులను అక్కడికక్కడే అధికారులు పరిష్కరించారు. సియాళిలిట్టి, పురణాపాణి, తబార్ సింగి, అనఘ గ్రామపంచాయితీల నుంచి ప్రజలు విచ్చేసి తమ అభియోగాలు అందజేశారు. భూపట్టాలు, రేషన్, వృద్ధాప్య పింఛనుపై ఎక్కువ వినతులున్నాయి. కార్యక్రమానికి ఆర్.ఉదయగిరి పంచాయతీ సమితి అధ్యక్షులు లక్ష్మీనారాయణ శోబోరో, ఐటీడీఏ పీవో అంశుమాన్ మహాపాత్రో, బీడీవో లారీమోహాన్ ఖర్సల్, తహసీల్దార్ జ్యోతి మయిదాస్, డీఎస్‌ఎస్‌వో సంతోష్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.
![గ్రీవెన్స్‌కు 86 వినతులు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10ors81a-280031_mr-1739216205-1.jpg)
గ్రీవెన్స్‌కు 86 వినతులు
Comments
Please login to add a commentAdd a comment