![వ్యక్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ors63-280071_mr-1739216205-0.jpg.webp?itok=xzcRxdE0)
వ్యక్తి మృతి
భువనేశ్వర్: ఖుర్దారోడ్ ప్రాంతంలో ఆంధ్రాలోని విశాఖకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానిక గొలై బజార్ వద్ద సోమవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అపస్మారక స్థితిలో వ్యక్తి పడి ఉన్నట్లు స్థానికుల దృష్టికి వచ్చింది. ఈ విషయం జట్నీ ఠాణా పోలీసులకు తెలియజేశారు. ఈ సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని తక్షణమే స్థానిక సొండుపూర్ సామూహిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. కాగా సదరు వ్యక్తి పేరు కర్రి సత్యనారాయణ, తండ్రి గంగరాజు, బీసీ కాలనీ, నర్సీపట్నం, విశాఖపట్నంగా గుర్తించారు. మృతదేహాన్ని భువనేశ్వర్ క్యాపిటల్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు చెప్పారు.
విద్యార్థులకు ఆల్బెండ్‌జోల్ మాత్రల పంపిణీ
రాయగడ: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని మునిగుడ సమితి హటోమునిగుడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండ్‌జోల్ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి పిల్లలకు మాత్రలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ లాల్‌మెహన్ రౌత్రాయ్, డాక్టర్ మమత సాహు ఉన్నారు.
![వ్యక్తి మృతి 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10ors3a-280030_mr-1739216206-1.jpg)
వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment