మంటల్లో విద్యార్థిని..
ఉల్లాసంగా.. ఉత్సాహంగా జయపురం భారతీ సాహితీ సంస్థ స్వర్ణో త్సవాలు ఘనంగా జరిగాయి. అతిథు లు నగరమంతా కలియతిరిగారు. –8లోu
పేదలకు సేవ చేయడంలోనే.. సాయి గాయత్రి పరివార్ మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. –8లోu
పర్లాకిమిడి: మంటల్లో విద్యార్థిని చిక్కుకుంది. ఈ సంఘటన స్థానిక హనుమాన్ మందిర్ ఎదురుగా ఉన్న శ్రీక్రిష్ణ చంద్ర గజపతి కళాశాల ఉమెన్స్ హాస్టల్‌లో చోటుచేసుకుంది. దోమల కోసం పెట్టిన కాయిల్ కారణంగా చెలరేగిన మంటల్లో విద్యార్థిని నబీనో నాయక్ చిక్కుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. శ్రీక్రిష్ణచంద్ర గజపతి కళాశాలలో ప్లస్ త్రీ సైన్స్ చదువుతున్న నబీనో నాయక్ ఆదివారం రాత్రి దోమలు ఎక్కువుగా ఉన్నాయని తన గదిలో దోమల కాయిల్ వెలిగించి నిద్రపోయింది. కాయిల్ దుప్పటికి తగలడంతో మంటలు వ్యాపించగా.. అందులో విద్యార్థిని చిక్కుకుని కాలిపోయింది. దీంతో వార్డెన్‌కు విద్యార్థులు ఫిర్యాదు చేయగా వెంటనే ప్రభుత్వ కేంద్ర మెడికల్‌కు నబీనో నాయక్ తరలించారు. కాలిపోయిన నబీనో నాయక్‌కు ప్రత్యేక వార్డులో ఉంచి డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు తెలియజేశారు.
ఉమెన్స్ హాస్టల్‌లో ఘటన
దోమల కాయిల్‌తో చెలరేగిన మంటలు
Comments
Please login to add a commentAdd a comment