బరంపురంలో ప్రధాని మోదీ పర్యటన నేడు | Sakshi
Sakshi News home page

బరంపురంలో ప్రధాని మోదీ పర్యటన నేడు

Published Mon, May 6 2024 4:55 AM

బరంపురంలో ప్రధాని మోదీ పర్యటన నేడు

బరంపురం: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నగర శివారులోని కొనిసి గ్రామంలో సోమవారం జరగనున్న బహిరంగా సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గోనున్నారు. సభలో గంజాం, అస్కా, భంజనగర్‌, పుల్భణి, నయగడా జిల్లాలకి చెందిన పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 9న గోపాల్‌పూర్‌లో సీఎం నవీన్‌ పర్యటన

బరంపురం: ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గంజాంలోని గోపాల్‌పూర్‌లో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 9.30 గంటల సమయంలో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని నవీన్‌ నివాస్‌ నుంచి సీఎం నవీన్‌ బిజూ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని, ప్రత్యేక హెలీప్యాడ్‌లో గంజాం జిల్లా బరంపురం నగరానికి దగ్గర రొంగయిలొండా పరిఽధిలోని పాలురు హిల్స్‌లో దిగుతారు. అక్కడకి దగ్గర కొరపల్లిలో ఏర్పాటు చేసిన బిజూ జనతా దళ్‌ (బీజేడీ) పార్టీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అస్కాకి ప్రత్యేక హెలీప్యాడ్‌లో బయల్దేరి పార్టీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం కొందమాల్‌ జిల్లా పుల్భణికి ప్రత్యేక హెలీప్యాడ్‌లో చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసగించనున్నారు. అనంతరం తిరిగి పుల్భణి నుంచి భువనేశ్వర్‌ చేరకోనున్నారు.

ముగ్గురు దోపిడీ దొంగల అరెస్టు

జయపురం: జాతీయ రహదారిపై వెళ్లేవారిని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలు పోలీసులకు చిక్కారు. జయపురం సబ్‌డివిజన్‌ పోలీసులు వీరిని శనివారం అరెస్టు చేసినట్లు కుంధ్ర పోలీసు అధికారి చిత్తరంజన్‌ ప్రధాన్‌ ఆదివారం విలేకరులకు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక బైక్‌, మొబైల్‌ ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో మఝిగుడ గ్రామానికి చెందిన మనోజ్‌ సాగరియ, కలియ గ్రామానికి చెందిన రంజన్‌ హరిజన్తో పాటు మైనర్‌ బాలుడు ఉన్నట్టు పేర్కొన్నారు. వీరు జాతీయ రహదారిలో ప్రయాణికులను అడ్డగించి మారణాయుధాలు చూపి భయపెట్టి వారి వద్ద ఉండే డబ్బులు, ఇతర విలువైన వస్తువులను దోపిపీ చేసేవారని వివరించారు. వీరి ఆగడాలపై ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పట్టుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో మైనర్‌ ఉండడంతో అతడిని బాల నేరస్తుల కోర్టుకు పంపించామన్నారు. మిగతా ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పరిచినట్టు వెల్లడించారు. కుంధ్ర ప్రాంతంలో జరిగిన పలు దొంగతనాలు, దోపిడీలతో వీరికి సంబంధం ఉన్నట్టు పేర్కొన్నారు.

బీజేపీ ఆరు గ్యారెంటీలు..ఒడిశాలో అమలు చేస్తాం

పర్లాకిమిడి: ఒడిశాలో జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కై వసం చేసుకుని అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేస్తుందని పార్టీ రాష్ట్ర ప్రతినిధి జ్ఞాణ రంజన్‌ బెహారా విలేకరులతో అన్నారు. స్థానిక విశ్వనాథ్‌ ఫంక్షన్‌ హాల్‌లో బీజేపీ ప్రభుత్వం శాసనంలోకి వస్తే రాష్ట్రంలో ఆరు గ్యారేంటీలు అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో నవీన్‌ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఒక్కరికై నా ప్రభుత్వం ఉద్యోగం కల్పించిందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు. ప్రతి ఇంటికీ 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట, ప్రతి ఇంటిలో ఆడపడుచుకు రూ.1000, పీఎం ఆవాస్‌ యోజనా కింద పేదలకు ఇళ్లు, ధాన్యానికి మద్దతు ధర, పర్లాకిమిడిలో ఒక మెడికల్‌ కళాశాల ఏర్పాటు, జిల్లా కేంద్రంలో ప్రధాన రహదార్లు వేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బరంపురంలోని కోనిసిలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని జ్ఞాన బెహారా అన్నారు. ఈ సమావేశంలో ఛిత్రి సింహాద్రి, బీజేపీ సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, జిల్లా యువజన మోర్చా కార్యదర్శి బాలికృష్ణ పాత్రో, దేవి ప్రసాద్‌ దాస్‌, కౌన్సిలర్‌ బబునా బెహారా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement