రోగికి వైద్యుడి రక్తదానం | - | Sakshi
Sakshi News home page

రోగికి వైద్యుడి రక్తదానం

Published Thu, Sep 12 2024 8:26 AM | Last Updated on Thu, Sep 12 2024 8:26 AM

రోగికి వైద్యుడి రక్తదానం

కాశీబుగ్గ: ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్యసేవలు అందించడమే కాదు అవసరమైనప్పుడు రక్తదానం చేసి ప్రాణాలు సైతం నిలుపుతామని నిరూపించారు డాక్టర్‌ నంబాళ్ల శ్రీనివాసరావు. వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామానికి చెందిన తామాడ నారాయణమ్మ పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బుధవారం ‘ఏ నెగిటివ్‌’ గ్రూపు రక్తం అత్యవసరం కావడంతో ఆ నలుగురు ట్రస్ట్‌ చైర్మన్‌ పిచ్చుక పాపారావు ఇచ్చిన సమాచారం మేరకు పలాసలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కిడ్నీ పరిశోధన కేంద్రంలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ నంబాళ్ల శ్రీనివాసరావు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావును కిడ్నీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అల్లు పద్మజ, సివిల్‌ సర్జెన్‌ రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర కూన మోహనబాబు అభినందనలు తెలిపారు.

15న కొన్న చిన్నారావు అథ్లెటిక్స్‌ మీట్‌

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాయిదాపడిన కొన్న చిన్నారావు జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2024 పోటీలు ఈ నెల 15న నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్‌)కళాశాల మైదానం వేదికగా ఆదివారం ఉదయం 9 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. అండర్‌ 14, 16, 18, 20 వయో విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా రన్నింగ్‌, త్రోస్‌, జంప్స్‌ ఈవెంట్స్‌ నిర్వహించనున్నారు. ఇక్కడ రాణించిన వారిని గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని మీట్‌ నిర్వాహకుడు, అథ్లెటిక్స్‌ సంఘ రాష్ట్ర, జిల్లా చైర్మన్‌ కొన్న వెంకటేశ్వరరావు(వాసు) తెలిపారు. పూర్తి వివరాలకు అథ్లెటిక్స్‌ సంఘ జిల్లా కార్యదర్శి, పీడి మెంటాడ సామమూర్తి (సెల్‌:85002 71575)ని సంప్రదించాలని కోరారు.

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఈ నెల 14, 15 తేదీల్లో భీమిలిలో జరగనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీకి చెందిన 24 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ఆచార్య కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ బుధవారం అభినందించారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్‌ కొర్ల మోహన్‌కృష్ణ చౌదరి, యోగా విభాగాధిపతి డాక్టర్‌ ఈశ్వరరావు, యోగా అధ్యాపకులు అర్చన, ధనుంజయరావు, వెల్ఫేర్‌ డీన్‌ గేదెల రవి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement