విజేతలుగా కొరాపుట్‌ విద్యార్థినులు | - | Sakshi
Sakshi News home page

విజేతలుగా కొరాపుట్‌ విద్యార్థినులు

Published Thu, Sep 12 2024 8:26 AM | Last Updated on Thu, Sep 12 2024 8:26 AM

విజేతలుగా కొరాపుట్‌ విద్యార్థినులు

జయపురం: పట్టణంలోని జిల్లా విజ్ఞాన కేంద్రంలో బుధవారం నిర్వహించిన విజ్ఞాన సంబంధిత నాటక పోటీల్లో కొరాపుట్‌ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 18 పాఠశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రథమ స్థానం కొరాపుట్‌ పొందగా, ద్వితీయ స్థానంలో మనబార్‌ ఉన్నత పాఠశాల, తృతీయ స్థానంలో జయపురం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు నిలిచారు. ప్రథమ స్థానం పొందిన టీమ్‌ త్వరలో రాయగడలో జరగనున్న జోనల్‌ స్థాయి పోటీలో పాల్గొంటుందని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో కొరాపుట్‌ జిల్లా విద్యాధికారి ప్రమోద్‌ కుమార్‌ మహంతి, కళాకారుడు థీరెన్‌ మోహన్‌ పట్నాయక్‌, జయపురం బీఈవో చందన కుమార్‌ నాయిక్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement