No Headline
దేవీ నవరాత్రులు గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు 9 రోజుల పాటు రోజుకో స్వరూపంలో పూజలందుకొని మానవాళికి వరాలు ప్రసాదించి కొంగు బంగారంగా కటాక్షిస్తుంది. నవరాత్రి ఉత్సవాలు తొలిరోజున దేవీ శైలపుత్రిగా పూజలందుకుని భక్త జనులను తరింపజేసింది. నవరాత్రి ఉత్సవాల్లో నవ రూపాల్లో దేవీ పూజలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే తరహాలో రోజుకో వర్ణం (రంగు) ప్రాధాన్యత కలిగి ఉండడం విశేషం. భక్తజన హృదయాల్లో కదిలాడే దివ్య మనోహర అలంకరణ దేవీ ప్రత్యక్షతకు అద్దం పడుతుంది. ప్రతిపద నుంచి నవమి వరకు నవ రూపాల్లో దేవీ దర్శనం పొందుతూ, అత్యంత నియమనిష్టలతో పూజలు చేసిన భక్తులు దశమి నాడు ఈ పూజని శాస్త్రోక్తంగా ముగిస్తారు. విజయ దశ మి రోజున జనులంతా వేడుకగా దేవీ పూజల్లో భక్తిశ్రద్ధలతో పాలుపంచుకుంటారు.
– సాక్షి నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment