నిధులు మంజూరు చేయాలి
జయపురం: రాష్ట్రంలోని 391 కళాశాలలకు నిధులు మంజూరు చేయాలని కొరాపుట్ జిల్లా సమితి స్థా యి ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో కొరాపుట్ జిల్లా సమితి స్థా యి ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సంఘం అధ్యక్షు డు అశ్వినీకుమార్ మెహర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమితిలలో గల కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్థావించారు. సమస్యల పరిష్కారాని సమైఖ్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉన్నత విద్యా విభాగం ప్రతిపాదించి న సహాయక నిధి ఫైల్ మూలన పడి ఉందని ఆరో పించారు. వెంటనే ప్రభుత్వం ఆ ఫైల్‌ను ఆర్థిక విభాగానికి పంపి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీకాంత వల్లభ సామంత, ఉపాధ్యక్షులు డాక్టర్ సి.హెచ్.సుధాకర్, డాక్టర్ ప్రదీప్‌కుమార్ స్వైయ్, నవరంగపూర్ జిల్లా సంఘం అధ్యక్షుడు శివ పట్నాయిక్, కొరాపుట్ జిల్లా అధ్యక్షులు వైజయంతి సామల్, మల్కనగిరి జిల్లా అధ్యక్షుడు గౌరీశంకర బెహర, కలహండి జిల్లా సంఘ అధ్యక్షుడు బంకిమ్, రాయగడ జిల్లా సంఘ అధ్యక్షులు సుజాత దాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment