ఆకలి పీడితులకు పరామర్శ
భువనేశ్వర్: కంధమల్ జిల్లా దారింగిబాడి మండ లం మండిపొంకా గ్రామంలో మామిడి బద్దల కాలు ష్య కాటుకు గురైన బాధితులకు పరామర్శించేందు కు ఉభయ అధికార, విపక్ష ప్రముఖులు కటక్ ఎస్సీ బీ వైద్య బోధన ఆస్పత్రిని సోమవారం సందర్శించారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ ఉన్నారు. యువజన నాయకుడు వ్యోమకేశ రాయ్ ఆధ్వర్యంలో విపక్ష బిజూ జనతా దళ్ ప్రతినిథి బృందం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల బాగోగుల్ని సంప్రదించింది. టున్ని మాఝి, జిత్తొ మా ఝి అనే ఇరువురు మహిళలు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరివురికి నాణ్యమైన ఉన్నత స్థా యి చికిత్స అందించి కోలుకునేలా చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సూచించారు. కంధమల్ జిల్లా దారింగిబాడి మండలంలో మామిడి బద్దలతో పొ ట్ట నింపుకునే ప్రయత్నం కొంత మంది ప్రాణాల్ని పొట్టన బెట్టుకుంది. మరికొంత మందిని అనారో గ్యం పాలు చేసింది. వీరిలో 2 మంది పరిస్థితి విష మించడంతో కటక్ ఎస్సీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై నిజ నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని బీజే డీ నాయకుడు వ్యోమకేశ రాయ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment