పొగాకు విముక్తి అభిజాన్
రాయగడ: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రాస్పత్రిలో పొగాకు విముక్తి అభిజాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ ఫరూల్ పట్వారీ ముఖ్య అతిథిగా హజరై పోగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి వివరించారు. అనంతరం ప్రజలకు అవగాహన కలిగేలా పోస్టర్లను ఆవిష్కరించారు. మత్తుకు యువత బానిసై తమ బంగారు భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ సమాజ నిర్మాణానికి యువత కీలకమని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ లాల్ మోహన్ రౌత్రాయ్, ఏఎస్పీ భీమసేన్ నాయక్, ఏడీఎం పబ్లిక్ హెల్త్ డాక్టర్ మమత సాహు, డాక్టర్ ప్రదీప్ కుమార్ సుబుద్ధి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు మనోజ్ కుమార్
జయపురం: సబ్ డివిజన్ పరిధి కుంద్రలోని బిజూ పట్నాయక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి మోహన్ కుమార్ మడ్కామి జాతీయ స్థాయి విలు విద్య పోటీలో పాల్గోనున్నాడు. నవంబర్ 11వ తేదీన గుజరాత్ వేదికగా జరగనున్న విలు విద్య పోటీల్లో ఒడిశాకు మడ్కామి ప్రాతినిద్యం వహించనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన భువనేశ్వర్ కిష్ ఉన్నత మాధ్యమిక పాఠశాల ప్రాంగణంలో జరిగిన రాష్ట్రస్థాయి విలు విద్య పోటీల్లో సత్తాచాటి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. దీంతో అతడికి పలువురు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment