ఇస్కాన్ రథయాత్ర రద్దు
భువనేశ్వర్: ఎట్టకేలకు ఇస్కాన్ సంస్థ సంకల్పించిన అకాల రథయాత్ర రద్దు చేసినట్లు ప్రకటించారు. అమెరికా హ్యూస్టన్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9న రథ యాత్ర నిర్వహణ ఖరారు చేసి ఆహ్వానం జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ చర్య పట్ల రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తి తలెత్తింది.ఈ కార్యక్రమం ఉపసంహరించకుంటే న్యాయ పోరాటానికి దిగుతామని గజపతి మహారాజా బాహాటంగా హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఇస్కాన్ శాఖ ఈ నెల 9న సంకల్పించిన జగన్నాథ రథ యాత్ర రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇస్కాన్ భువనేశ్వర్ శాఖ ఉపాధ్యక్షుడు తుకారం దాస్ మంగళవారం సాయంత్రం ఈ విషయం వెల్లడించారు.
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం
పర్లాకిమిడి: పెట్రోల్, వంటగ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్, రవాణా చేసేటప్పుడు రసాయన ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బిజయకుమార్ దాస్ అన్నారు. మంగళవారం స్థానిక కాన్ఫరెన్సు హాలులో హిందూస్థాన్, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ల ప్రతినిధులు, ఎస్పీ జితేంద్రకుమార్ పండా, డిప్యూటీ కలెక్టర్, అత్యవసర అధికారి కమలకాంత పండా, ఏడీఎం రాజేంద్ర మింజ్, జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ప్రసన్నకుమార్‌దాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెట్రోలియం, గ్యాస్ కంపెనీలు గొడౌన్‌ల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో హెచ్‌పీ గ్యాస్ కంపెనీ ప్రతినిధి శోభన్‌కుమార్ సాహు, గజపతి జిల్లా హెచ్‌పీ గ్యాస్ డీలర్ దేవేంద్రనాథ్ సాహు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment