విద్యారంగం పటిష్టతకు చర్యలు
రాయగడ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండ జిల్లాలోని బిసంకటక్‌లో శనివారం సాయంత్రం పర్యటించారు. సమితి పరిధిలోని పాయికొడొకులుగుడలో మనోరేగ పథకంలో భాగంగా సుమారు రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించిన ఉన్నత పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఇ దిలాఉండగా ఆదివాసీ సంక్షేమ పాఠశాలలలో చ దువుతున్న విద్యార్తులకు మరిన్ని సౌకర్యాలను క ల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ప ట్నాయక్, పార్టీ సీనియర్ నాయకులు కాళీరాం మా ఝి, శివశంకర్ ఉలక, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, బిడిఒ సదాశివ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి గొండ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, పథకాలు ప్రజల దరికి చేరేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండ
Comments
Please login to add a commentAdd a comment