చోరీ కేసులో నిందితుల అరెస్ట్
● చోరీసొత్తు స్వాధీనం
కొరాపుట్: చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌డీపీవో మధు సిక్తా మిశ్ర కేసు వివరాలు ప్రకటించారు. దసరా పొదవీధిలో ఈ నెల 12 తేదీన వివేక్ మిశ్ర ఇంట్లో దొంగలు పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా వాస్తవం బయటపడింది. బాధితుని బంధువైన 14 ఏళ్ల బాలుడు దొంగతనానికి సూత్రధారిగా తేలింది. బాలుడిని అదుపులోనికి తీసుకొని విచారించగా వివరాలు బయట పడ్డాయి. భంజ్ వీధికి చెందిన టునా దాస్, శివ బారిక్ దొంగతనం చేసినట్లు అంగీకరించారు. వీరి వద్ద రితేష్ కర్కరా, కిశోర్‌గౌడ్‌లు చోరీ వస్తువులు కొనుగోలు చేసినట్టు అంగీకరించారు. వీరి వద్ద నుంచి మూడు తులాల బంగారం, ఎనిమిది చెవి పొగులు, ఒక నెక్లస్, ఒక బ్రాస్లెట్, ఆరు బంగారు కమ్ములు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీటి విలువు సుమారు రూ. తొమ్మిది లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment