సంతలో వస్తు విక్రయాలపై.. విద్యార్థులకు అవగాహన
మల్కన్‌గిరి: వ్యాపారంపై విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రక్రియకు ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వబిమాన్ ఏరియా బోడపోదర్ పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో వారపు సంతలో ఎలా వ్యాపారం చేస్తారో వివరించేలా విద్యార్థులతో ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు వ్యాపారులుగా ఉపాధ్యాయులు కొనుగోలుదారులుగా వ్యవహరించారు. అచ్చం సంతలో విక్రయించేలా కూరగాయలు, బట్టలు, గాజుల దుకాణం, గిరిజన పంటలు ఇలా అనేక రకాలను విద్యార్థులు అమ్మిచూపారు. గతంలో సంతల్లో వ్యాపారులు అమాయకులైన గిరిజనులను ఎలా మోసం చేసేవారో గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టు ప్రభవిత ప్రాంతం. దీంతో ఇక్కడ వారు ఎక్కువగా బయటకు వెళ్లేవారు కాదు. దీంతో ఇక్కడకు వ్యాపారులు వచ్చి తక్కువ ధరకు కొనుగోలు చేసే వస్తువులు అధిక ధరలకు గిరిజనులకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. అలాంటి వ్యాపారులకు బుద్ధి చెప్పేలా పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ముఖ్యఅతిథిగా హాజరైన సమితి అధికారి దిలీప్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment