ఘనంగా హరిశ్చంద్ర భక్షిపాత్రో జయంతి
కొరాపుట్: దివంగత మంత్రి హరిశ్చంద్ర భక్షిపాత్రో 91వ జయంతి ఘనంగా జరిగింది. ఆదివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి మీద ఉన్న హరిశ్చంద్ర భక్షిపాత్రో విగ్రహానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. హరిశ్చంద్ర కొరాపుట్, జయపూర్ స్ధానాలకు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. కార్యక్రమంలో కొరాపుట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణిగ్రాహీ, కొరాపుట్ మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి, జయపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మున్నా రధొ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment