లక్ష్మణ్‌నాయక్ ఆశయాలను కొనసాగించాలి
● నివాళులర్పించిన ప్రముఖులు
రాయగడ:
స్వాతంత్య్ర సమరయోధుడు, ఆదివాసీ నాయకుడు సహీద్ లక్ష్మణ్ నాయక్ ఆశయాలను కొనసాగించాలని వక్తలు పిలుపునిచ్చారు. లక్ష్మణ్ నాయక్ 125వ జయంతిని శుక్రవారం అధికారికంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాయగడ లోని శాసీ్త్రనగర్‌లో ఉన్న లక్ష్మణ్ నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరైతా, వాటర్ షెడ్ పీడీ దయానిధి బాగ్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంతకుమార్ ప్రధాన్ తదితర ప్రముఖు లు హాజరై లక్ష్మణ్ నాయక్ సేవలను గుర్తు చేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు లక్ష్మణ్ నాయక్ పొరాట పటిమను గురించి కొనియాడారు.
కొరాపుట్: స్వాతంత్య్ర పోరాటంలో బలిదానం చేసిన కొరాపుట్ జిల్లాల గిరిజన యోధుడు సాహీద్ లక్ష్మణ్ నాయక్ జయంతిని కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌లోని లక్ష్మణ్ నాయక్ విగ్రహానికి పొట్టంగి ఎమ్మెల్యే రాం చంద్ర ఖడం, కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సస్మితా మెలకలు పూల మాలలు వేసి నివాళులర్పి ంచారు. కొరాపుట్ జిల్లా సునాబెడా మున్సిపల్ చైర్మన్ రాజేంద్రకుమార్ పాత్రో పట్టణంలోని సహచర కౌన్సిలర్లతో వెళ్లి లక్ష్మణ్ నాయక్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆయన విగ్రహానికి విద్యార్థులు నివాళులర్పించారు.
జయపురం: సహిద్ లక్ష్మణ నాయక్ జయంతి కార్యక్రమాన్ని జయపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. స్థానిక గుప్తేశ్వర కాప్లెక్స్ ప్రాంగణంలోని లక్ష్మణ నాయక్ విగ్రహానికి జయపురం సబ్‌కలెక్టర్ ఎ.శొశ్యరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమెతో పాటు జయపురం సబ్‌డివిజన్ ఏడీపీఆర్వో యశోద గదబ తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ నాయక్ జన్మస్థలం తెంతులిగుమ్మకు సబ్ కలెక్టర్ శొశ్యరెడ్డి వెళ్లారు. అలాగే లక్ష్మణ నాయక్ స్మృతి సమితి జయపురం వారు నాయక్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పి్‌ంచారు. కార్యక్రమంలో స్మృతి సమితి అధ్యక్షుడు మదన మోహననాయక్, కార్యదర్శి మాధవ చౌదురి, ఉపాధ్యక్షులు గౌరవ బోత్ర, సహాయ కార్యదర్శి వెంకటరావు పట్నాయక్, సలహాదారులు బాలా రాయ్, కృష్ణ చంద్రహొత్త, సురేంద్రఖొర, అదివాసీ, దళిత మహాసంఘం మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు మమత నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.
కొట్‌పాడ్‌లో..
కొట్‌పాడ్‌లో సాహిద్ లక్ష్మణ నాయక్ జయంతిని ఆదివాసీ సంఘం నిర్వహించారు. లక్ష్మణ నాయిక్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని గర్‌ల్స్ హైస్కూల్ అవరణలో ఉన్న లక్ష్మణ్ నాయక్ విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ సోమానాథ్‌ప్రధన్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మల్కన్‌గిరి జిల్లా కోసం లక్ష్మణ్ నాయక్ వ్యక్తిగా కాకుండా శక్తిగా చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీఐపీఆర్‌వో ప్రమిళ మాఝి, పాఠశాల ఉపాధ్యాయుడు ధఉష్మంతో జెన, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment