రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించాలి : పీఓ
పార్వతీపురం టౌన్: జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఆకాంక్షించారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి నేపథ్యంలో జన్ జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు జరిగాయి. అందులో భాగంగా వాలీబాల్, జావలింగ్ త్రో, ఆర్చరీలలో విజేతలుగా ఎంపికై న 28 మంది విజేతలకు శుక్రవారం ఆయన కార్యాలయం వద్ద పీఓ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొంది పతకాలతో తిరిగిరావాలని ఆశీర్వదించారు.
24న జరగబోయే రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలకు 33 మంది విద్యార్థినులు, 22 మంది గిరిజన కళాకారుల బృందం పాల్గొంటున్నట్లు తెలిపారు. 25న రాష్ట్ర స్థాయిలో జరగనున్న వ్యాసరచన, పెయింటింగ్, వక్తృత్వ పోటీల్లో 9 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment